విశాఖ: ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం తీవ్రంగా మారింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. శని, ఆది, సోమ వారాల్లో వర్షాలు పడతాయని పేర్కొంది. కోస్తా, రాయలసీమాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని సూచించింది. ఏపీ వ్యాప్తంగా చాలా చోట్ల చెదురుముదురుగా వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. కోస్తాలో తీరం వెంబడి బలమైన గాలులు వీచే అవకాశం ఉందని ప్రకటించింది. మత్య్సకారులు వేటకు వెళ్లే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. తెలంగాణలో అక్కడక్కడ తేలికపాటి వర్షం కురుస్తోందని వెల్లడించింది. ఇప్పటికే హైదరాబాద్‌లో శుక్రవారం పలు చోట్ల వర్షం కురిసిన విషయం తెలిసిందే.
తీవ్ర అల్పపీడనం… ఏపీ, తెలంగాణకు వర్ష సూచన
-