హైదరాబాద్: మందుబాబులకు ప్రభుత్వం షాకింగ్ న్యూస్ తెలిపింది. దీంతో రెండు రోజుల పాటు మందుబాబుల నోటికి తాళం పడనుంది. నగరంలో బోనాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యలో రేపు, ఎల్లుండి వైన్స్ షాపులు, బార్లు, కల్లు దుకాణాలను బంద్ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇళ్లలోనే బోనాలు పండుగ జరుపుకోవాలని ప్రభుత్వం సూచించింది.
మరోవైపు ఆంక్షలు కఠినంగా అమలు చేయాలని పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. బోనాలు, పలహార బండ్ల ఊరేగింపు, రంగం కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకుని భద్రతకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు. ఆది, సోమ వారాల్లో వైన్స్ షాపులు, బార్లు బంద్ చేయాలని నోటీసులు జారీ చేశారు. ఆంక్షలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. రెండు రోజుల పాటు పూర్తి షాపులు మూసి ఉంచాలని సూచించారు.
దీంతో రెండు రోజుల పాటు నగరంలో వైన్స్ షాపులు, బార్లు మూతపడనున్నాయి. దీంతో మందుబాబులు వర్రీ అవుతున్నారట. మందు తాగకుండా ఉండటం తమ వల్ల కాదంటున్నారట. రెండు రోజుల పాటు వైన్సులు బంద్ చేస్తే తాము ముందే తెచ్చుకుంటామని అంటున్నారట.
ఇక ప్రభుత్వ నిర్ణయంతో శనివారం వైన్స్ షాపులకు భారీగా ఆదాయం వచ్చే అవకాశం ఉందని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. మందుబాబులు ఇంకెందుకు లేటు… త్వరగా వెళ్లి మందు తెచ్చుకోండి. కానీ అతిగా తాగి ఆరోగ్యం పాడు చేసుకోవద్దని పలువురు ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.