భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో వన్డేకు వరుణుడు మళ్లీ అంతరాయం కలిగించాడు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 9వ ఓవర్ పూర్తయ్యాక వాన మొదలైంది. దాంతో, ఇరుజట్ల ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్‌కు పరుగెత్తారు. అప్పటికీ కంగారూ జట్టు స్కోర్.. 56-2. మార్నస్ లబూషేన్(17), డేవిడ్ వార్నర్(26) క్రీజులో ఉన్నారు. ఆసీస్ విజయానికి ఇంకా 344 పరుగులు కావాలి. వర్షం కారణంగా ఓవర్లను కుదించే చాన్స్ ఉంది.
టీమిండియా నిర్దేశించిన 400 పరుగుల ఛేదనలో ఆసీస్ కష్టాల్లో పడింది. 9 పరుగులకే ఆసీస్ రెండు కీలక వికెట్లు పడ్డాయి. ప్రసిద్ కృష్ణ తన తొలి ఓవర్‌లోనే వరుస బంతుల్లో ఓపెనర్ మాథ్యూ షార్ట్(9), స్టీవ్ స్మిత్(0)లను ఔట్ చేశా. అయితే.. హ్యాట్రిక్ బంతికి లబూషేన్ ఒక పరుగు తీశాడు. మొదట ఆడిన టీమిండియా 5 వికెట్ల నష్టానికి 399 పరుగులు చేసింది. ఓపెనర్ శుభ్‌మన్ గిల్(104), శ్రేయస్ అయ్యర్(105) సెంచరీలతో చెలరేగారు. ఆ తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్(72 నాటౌట్) కెప్టెన్ కేఎల్ రాహుల్(52 ) దంచి కొట్టారు. దాంతో, 399 రన్స్ చేసింది. వన్డే ఫార్మాట్‌లో ఆస్ట్రేలియాపై టీమిండియాకు ఇదే అత్యధిక స్కోర్ కావడం విశేషం.