హైదరాబాద్ విద్యార్థినిపై ప్రధాని మోడీ ప్రశంసలు

-

ప్రతి నెల మన్‌ కీ బాత్‌ కార్యక్రమంలో పలువురు వ్యక్తుల గురించే మాట్లాడే ప్రధాని మోదీ.. 2023 సెప్టెంబర్ 24 న హైదరాబాద్ విద్యార్థినిపై ప్రశంసలు కురింపించారు. ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ మన్‌ కీ బాత్‌లో దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ… హైదరాబాద్‌కు చెందిన 7వ తరగతి విద్యార్థిని ఆయన అభినందించారు.

మరోవైపు తన ట్విట్టర్ ఖాతాలో తెలుగులో పోస్ట్ చేశారు. బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌కు చెందిన ఆకర్షణ సతీష్.. సొంతంగా ఏడు లైబ్రరీలను స్థాపించడాన్ని ప్రధాని కొనియాడారు. హైదరాబాద్‌లో లైబ్రరీలకు కోసం కృషి చేసిన ఆకర్షణ గురించి తెలుసుకున్నాని చెప్పారు. క్యాన్సర్ ఆస్పత్రిలో పిల్లల కోసం మొదటి లైబ్రరీ ప్రారంభించిందని మన్ కీ బాత్‌లో తెలిపారు. పేద పిల్లల కోసం ఇప్పటివరకు లైబ్రరీల్లో సుమారు 6 వేల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయన్నారు. పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఈ చిన్న ‘ఆకర్షణ’ విశేషంగా కృషి చేస్తున్న తీరు అందరిలోనూ స్ఫూర్తి నింపుతోందని ప్రధాని మోడీ హర్షం వ్యక్తంచేశారు.

పుస్తక పఠనంపై ఉన్న ఆసక్తితో ఇతరులను కూడా చదివించాలని ఆకర్షణ ప్రయత్నిస్తోంది. తన తండ్రి డా. సతీశ్‌ కుమార్‌ ప్రోత్సాహంతో పుస్తకాలను సేకరించడం అలవాటుగా చేసుకుంది. అంతేకాకుండా ఆసుపత్రి అధికారుల అనుమతితో ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఆసుపత్రిలో, పలు ప్రాంతాల్లో గ్రంథాలయాలను ఏర్పాటు చేసింది.హైదరాబాద్‌లోని 7 లైబ్రరీల కోసం ఆమె 5800 పాత పుస్తకాలను సేకరించగలిగింది. చిన్న వయసులో తన వంతు కృషి చేస్తున్నందుకు గానూ మోదీ అకర్షణను అభినందించారు . ఆకర్షణను చూసి గర్విస్తున్నానని మోదీ అన్నారు. గతంలో కూడా చిన్నారి ప్రయత్నానికి రాష్ట్రపతి నుంచి కూడా గతంలో ప్రశంసలు లభించాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version