బంగాళ ఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం కారణంగా ఏపీ, తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ క్రమంలోనే ఆదివారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని కేంద్ర వాతావరణ శాఖ తెలిపింది. ఉపరితల ద్రోణి సౌత్ కర్ణాటక నుంచి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు తమిళనాడు మీదుగా పయనిస్తున్నట్లు పేర్కొంది. దీంతో నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయని తెలిపింది.
దీని కారణంగా ఏపీలోని పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ప్రకాశం, కర్నూలు, అనంతపురం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే చాన్స్ ఉందని సమాచారం.అదే విధంగా ఉత్తర తెలంగాణలో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం తర్వాత ఉత్తర తెలంగాణ, మధ్య తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్‌లో వాతావరణం మేఘావృతం ఉంటుందని, పలు చోట్ల చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.