భోజనంలో జెర్రీ..కాకినాడ సుబ్బయ్య హోటల్ సీజ్

-

కాకినాడ సుబ్బయ్య హోటల్ ను ఫుడ్ సేఫ్టీ అధికారులు సీజ్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఫేమస్ అయిన కాకినాడ సుబ్బయ్య హోటల్ ను విజయవాడలో సీజ్ చేశారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. తెలుగు రాష్ట్రాల్లో ఎంతో పేరు ఉన్న కాకినాడ సుబ్బయ్య హోటల్లో జెర్రి కలకలం రేపింది. కాకినాడ సుబ్బయ్య హోటల్లో ఒక వ్యక్తి భోజనంలో జెర్రి దర్శనమిచ్చింది.

Kakinada Subbaiah Hotel in Vijayawada was seized by food safety officials

అదే సమయంలో హోటల్లో కేంద్ర మానవ హక్కుల కమిషన్ ఇన్చార్జి చైర్మన్ విజయభారతి భోజనం చేస్తున్నారు. ఈ తరుణంలోనే.. వెంటనే రియాక్ట్‌ అయ్యారు కేంద్ర మానవ హక్కుల కమిషన్ ఇన్చార్జి చైర్మన్ విజయభారతి. కాకినాడ సుబ్బయ్య హోటల్ నిర్వాహకుల తీరుపై సీరియస్ అయి ఫుడ్ సేఫ్టీ అధికారులకు కేంద్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ విజయభారతి ఫిర్యాదు చేశారు. ఈ దెబ్బకు తనిఖీలు చేసి సుబ్బయ్య హోటల్ ను సీజ్ చేశారు అధికారులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version