హైదరాబాద్లోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్, మణికొండ, షేక్పేట, గచ్చిబౌలి, ఖైరతాబాద్, దిల్సుఖ్నగర్, లక్షీకపూల్, పంజాగుట్ట తదితర ఏరియాల్లో వర్షం పడుతోంది. సుమారు గంట నుంచి ఏకధాటిగా కుండపోత వర్షం పడుతుండడంతో రోడ్లన్నీ నదులను తలపిస్తున్నాయి.దీంతో నగరంలోని రోడ్లు నీటితో నిండిపోయాయి.ఫలితంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ఈ క్రమంలో ప్రజలందరూ అలర్ట్‌గా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరించారు.
ఇక హైదరాబాద్‌లో కుండ పోత వర్షం పడటంపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.హైదరాబాద్‌తో పాటు వర్షం పడుతున్న ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని రేవంత్ రెడ్డి సూచించారు. సచివాలయం నుంచి అన్ని విభాగాల అధికారులతో రేవంత్ రెడ్డి మాట్లాడారు. ప్రజలకు ఎక్కడా ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు.