హైదరాబాద్‌లో భారీ వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం

-

హైదరాదరాబాద్‌లో సోమవారం సాయంత్రం పలుచోట్ల వర్షం కురిసింది. ఖైరతాబాద్, లక్డీకాపూర్‌, పంజాగుట్ట, చిలకలగూడ, మారేడ్‌పల్లి, బోయినపల్లి, తిరుమలగిరి, బేగంపేట, ప్యాట్నీ, బోరబండ, అల్లాపూర్‌, మోతీనగర్‌, ఎర్రగడ్డ ప్రాంతాల్లో వర్షం కురిసింది. సనత్‌నగర్‌, ఎస్సార్‌నగర్‌, అమీర్‌పేట, మధురానగర్‌, యూసుఫ్‌గూడ, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, రామంతాపూర్‌, షైక్‌పేట, మణికొండతో పాటు పలు ప్రాంతాల్లో వాన కురిసింది. ఒక్కసారిగా వర్షం కురవడంతో వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. రాబోయే గంట సేపట్లో హైదరాబాద్‌ నగరంలో పలుచోట్ల వర్షం కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ తెలిపింది.

అలాగే కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, సంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, జగిత్యాల, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, మహబూబాబాద్, కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, నారాయణ్ పేట్, మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, యాదాద్రి భువనగిరి, జనగాం, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుందని భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

 

ఇక, హైదరాబాద్ నగరంలో ఇప్పటికే ఒకసారి వర్షం పడింది.. కాగా, ఆకాశం మేఘావృత అయింది. నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే ఛాన్స్ ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 31 డిగ్రీలు, 23 డిగ్రీలుగా ఉండే ఛాన్స్ ఉంది. ఉపరితల గాలులు గంటకు 6 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో పశ్చిమ దిశగా వీచే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version