మూడో వన్డేకు వర్షం అంతరాయం.. ఆటను నిలిపివేసిన అంపైర్లు..

-

కొలంబో వేదికగా… టీం ఇండియా మరియు శ్రీలంక జట్టు మధ్య మూడో వన్డే జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన టీం ఇండియా.. మొదటగా బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఈ నేపథ్యంలో టీం ఇండియా ఆరంభంలోనే మూడు వికెట్లు కోల్పోయి… 147 పరుగులు మాత్రమే చేసింది. అయితే… ఈ సమయానికి క్రీజులో స్టార్‌ బ్యాట్స్‌ మెన్‌ సూర్య కుమార్‌ యాదవ్‌ మరియు మనీశ్‌ పాండే ఉన్నారు.

ఈ తరుణంలోనే మ్యాచ్‌ కు వర్షం అంతరాయం కలిగించింది. దీంతో మూడో వన్డేను అంపైర్లు నిలిపేశారు. ఇక అంతకు ముందు యువ బ్యాట్స్‌ మెన్‌ సంజు శాంసన్‌ 46 పరుగులు, పృథ్వీషా 49 పరుగులు చేసి వెనుదిరిగారు. ఇక శ్రీలంక బౌలర్లలో చమీరా, జయ విక్రమ తలో వికెట్‌ పడగొట్టారు. కాగా… ఈ చివరి వన్డే మ్యాచ్‌లో కొత్తగా ఐదుగురు ఆటగాళ్లు అరంగేట్రం చేస్తున్నారు. సంజు శాంసన్‌, నితీశ్‌ రాణా, చేతన్‌ సకారియా, కృష్ణప్ప గౌతమ్‌, మరియు రాహుల్‌ చాహల్‌ ఈ మ్యాచ్‌లో ఆటనున్నారు. అలాగే నవదీప్‌ సైనికీ కూడా చోటు లభించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version