తెలుగు రాష్ట్రాలకు మరోమారు వర్ష ప్రమాదం పొంచి ఉంది. రెండు తెలుగు రాష్ట్రాలను వర్షాలు విడవడం లేదు. గులాబ్ తుఫాన్ ప్రభావం తగ్గకముందే మరోసారి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతారణ శాఖ హెచ్చరిస్తోంది. ఆ తరువాత వచ్చిన షహీన్ తుఫాన్ దేశంలో 7 రాష్ట్రాలను కలవరపెట్టింది. తాజాగా బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడటంతో వర్షాలు కురిసే అవకాశం ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో నేడు, రేపు రెండు రోజులు వానలు కురవనున్నాయి. ఏపీలో మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉంది. అలాగే తెలంగాణలో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇప్పుడిప్పుడే గులాబ్ తుఫాన్ మిగిల్చిన నష్టం నుంచి బయటపడుతున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు ఉపరితల ఆవర్తనం కలవరపెడుతోంది. వర్షాల కారణంగా రెండు రాష్ట్రాల్లో పంటలు తీవ్రంగా నష్టపోయాయి. రైతులకు తీరని నష్టం మిగిల్చాయి.