గత రెండు రోజులుగా తెలంగాణలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోనూ వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి.
మరో రెండు రోజుల పాటు కూడా రాష్ట్రంలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలో భాగంగా రెవిన్యూ శాఖలో అధికారులు, సిబ్బందికి సెలవులు రద్దు చేసింది. గోదావరి నుండి వరద ఉధృతంగా వస్తోన్న నేపథ్యంలో ఖమ్మం, భద్రాద్రి జిల్లాల కలెక్టర్లతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో విస్తారంగా కురవడంతో పాటు గోదావరి నుండి వరద ఎక్కువగా వస్తుండటంతో కలెక్టర్లు ప్రజలకు అందుబాటులో ఉండాలని,గోదావరి పరివాహక ప్రజలను అప్రమత్తం చేయాలని మంది పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు.