దేశ ద్రోహులు, హిందు ద్రోహులపైకి పక్కాగా బుల్డోజర్లు ఎక్కిస్తాం… కేటీఆర్ వ్యాఖ్యలకు రాజా సింగ్ కౌంటర్

-

గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్, మంత్రి కేటీఆర్ మధ్య ట్విట్టర్ వార్ జరుగుతోంది. యూపీలో యోగీకి ఓటేయని వారి ఇళ్లపైకి బుల్డోజర్లు పంపిస్తామని హెచ్చరించిన రాజాసింగ్ వ్యాఖ్యలకు కౌంటర్గా బీజేపీలో కమెడియన్ కనిపించాడంటూ… ట్విట్లర్ లో వ్యాఖ్యానించాడు. తాజాగా మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించాడు రాజాసింగ్.

కేటీఆర్ ట్విట్టర్ మెన్ అంటూ.. ఎద్దేవా చేశారు రాజా సింగ్. తెలంగాణలో జోకర్లు ఎవరో తెలుసు అంటూ వ్యాఖ్యానించారు. యూపీలో దేశ ద్రోహులు, హిందూ ద్రోహులపైకి బుల్డోజర్లు ఎక్కిస్తాం అంటూ మరోసారి వ్యాఖ్యాలు చేశారు. యూపీలో రౌడీ షీటర్లు, గుండాలను వ్యతిరేఖిస్తూ.. నిన్న వ్యాఖ్యలు చేశానని రాజా సింగ్ అన్నారు. అసెంబ్లీలో మాటిచ్చి బయట అబద్దాలు ఆడే వ్యక్తులు ఎవరో తెలుసని కేటీఆర్, కేసీఆర్ ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. యూపీలో గవర్నమెంట్ ప్లేసులు ఆక్రమించిన వారిని తరిమేసి ప్రజలకు యోగీ ఆదిత్య నాధ్ అందించారని అన్నారు. కేటీఆర్, ముఖ్యమంత్రికి పనిపాటా లేదని.. తెలంగాణలో జీరో అవుతున్నారని.. బీజేపీపై బురద జల్లేందుకు టీఆర్ఎస్ ప్రయత్నిస్తుందని రాజాసింగ్ వ్యాఖ్యానించారు. హిందువుల అటాక్ చేసే వారిపై తప్పకుండా బుల్డోజర్లు ఎక్కిస్తాం అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version