నన్ను చంపేస్తా అంటున్నారు: రాజాసింగ్

-

తనకు తరచూ బెదిరింపు కాల్స్ వస్తున్నాయని రాజాసింగ్ వీడియో విడుదల చేశారు. చంపేస్తాం, నరికేస్తాం అంటూ కాల్స్ వస్తున్నాయన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా యోగి ఆదిత్యనాథ్ గోషామహల్లో పర్యటిస్తారని.. ఇద్దరినీ కలిసి బ్లాస్ట్ చేస్తామని హెచ్చరిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసులు ఇటువంటి వారిని పట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని రాజాసింగ్ ఆరోపించారు. గుర్తు తెలియని నెంబర్ల నుంచి కాల్ వస్తోందని, తన ప్రతీ అడుగు వారికి తెలిసిపోతుందని ఫిర్యాదులో ఆరోపించారు రాజాసింగ్.

ఈ మేరకు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌తో పాటు.. రాష్ట్ర డీజీపీకి కూడా లేఖ రాశారు రాజాసింగ్. తనకు 15 డిజిట్ నెంబర్ నుంచి కాల్స్ వస్తున్నాయని, చంపుతాం, నరుకుతామని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇదే తొలిసారి కాదని, ఇంతకు ముందు కూడా ఇలాంటి కాల్స్ వచ్చాయని చెప్పారు రాజాసింగ్. తన గురించి, తన ప్రతి మూమెంట్ గురించి కాల్ చేసి చెప్తున్నారని ఆరోపించారు రాజాసింగ్. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాథ్ తన నియోజకవర్గానికి వస్తున్నారని, ఆ సమయంలో తమ ఇద్దరినీ కలిసి చంపేస్తామని భయపెడుతున్నారని అన్నారు రాజాసింగ్.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version