చీపురు పట్టిన రాజమౌళి ఎన్టీఆర్ ,రామ్ చరణ్ కి ఛాలెంజ్…!

-

లాక్ డౌన్ పుణ్యమా అని అందరూ ఇంటికి పరిమితం అయిపోయారు. ఎవరికి వారుగా ఇంట్లోనే ఉంటున్నారు. ఈ సమయంలో కాస్త కొత్తగా ఆలోచిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. ఎవరికి వారుగా ప్రజలను అలరించే ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా ప్రముఖ దర్శకుడు రాజమౌళి సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేసారు. అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా విసిరిన ఛాలెంజ్ కి ఆయన స్పందించి ఈ వీడియో పోస్ట్ చేసారు.

ఇంట్లోని మ‌హిళ‌ల‌తో ఇంటి ప‌నులు చేయించ‌కండి అని… మ‌గ‌వారికి ‘బీ ది రియ‌ల్ మేన్‌’ అనే ఛాలెంజ్ చేసారు. ఇంటి పనులు చేస్తున్న వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసి రాజ‌మౌళిని ఈ ఛాలెంజ్‌కు గాను సందీప్ రెడ్డి నామినేట్ చేసారు. ఛాలెంజ్‌లో భాగంగా ఇంటి ప‌నులు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యాలని సందీప్ విజ్ఞప్తి చేసారు. దీనికి జక్కన్న స్పందించారు.

ట్విట్ట‌ర్ ద్వారా సోమవారం త‌ను ప‌నిచేస్తున్న వీడియోను పోస్ట్ చేస్తాన‌ని చెప్పిన జక్కన్న ఇచ్చిన మాట ప్రకారం ఈ ఛాలెంజ్‌ని స్వీకరించి ఇంట్లో పనిచేస్తున్న వీడియోని పోస్ట్ చేసారు. ఆయన తర్వాత రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ని నామినేట్ చేసారు. తారక్, రామ్ చరణ్‌లను నామినేట్ చేస్తున్నా… వీరినే కాకుండా ఇంకొంచెం ఫన్ ఈ ఛాలెంజ్‌కు యాడ్ చేయాలని భావిస్తున్నా. అందుకే నిర్మాత శోభు యార్లగడ్డ, దర్శకుడు సుకుమార్ మరియు పెద్దన్న ఎమ్.ఎమ్. కీరవాణిని కూడా నామినేట్ చేస్తున్నా అని బీ ది రియ‌ల్ మేన్‌ అంటూ ట్వీట్ చేసారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version