ఇప్పుడు దేశంలో నంబర్ వన్ దర్శకుడిగా మన రాజమౌళి ఎదిగిన సంగతి అందరికి తెలిసిందే. బహుబలి సినిమా లతో భారతీయ చలన చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేశారుమళ్లీ ఆర్ఆర్ఆర్ సినిమాతో రికార్డ్స్ బ్రేక్ చేశారు రాజమౌళి. ఇప్పుడు తన తర్వాత సినిమా పై మనకంటే దేశంలో ఎక్కువుగా ఆసక్తి వుంది. అలాగే రీసెంట్ గా జపాన్ లో ఆర్ఆర్ఆర్ విడుదల చేస్తే మంచి వసూళ్లు సాధించాయి. అక్కడి ఫోటోస్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇక రాజ మౌళి ని పోగడని హీరోలు, నిర్మాతలు, దర్శకులు లేకుండా పోయారు. సంజయ్ లీలా భన్సాలీ వంటి వారు కూడా రాజమౌళి ని ఆకాశానికి ఎత్తేశారు. హీరోల రాజ్యం నడుస్తున్న కాలంలో తమ దర్శకులకు పేరు తెచ్చిన వాడని కీర్తించారు. తాజాగా ‘కేజీఎఫ్’ చిత్రంతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న యశ్ ఇటీవల ముంబయిలో జరిగిన ఓ కార్యక్రమంలో దర్శకుడు రాజమౌళిని విపరీతంగా పొగిడారు.
ఒకప్పుడు భారత దేశంలో సినిమా అంటే బాలీవుడ్ మాత్రమే వుండేదని, అప్పుడు సౌత్ ఇండియన్ సినిమాలు లకు అస్సలు గుర్తింపు వుండేది కాదని అన్నారు.అలాగే ‘ఒకప్పుడు సౌత్ సినిమాల్లో ఫైట్స్ చూసి బాలీవుడ్ వారు ఎగతాళి చేసే వారని , అలాగే అక్కడి పత్రికలు విమర్శిస్తూ రాసే వని అన్నారు. ఎప్పుడైతే రాజ మౌళి బాహుబలి సినిమా తీసారో అప్పటినుండి హిందీ ప్రేక్షకులు దక్షిణాది చిత్రాలపై ఇష్టాన్ని పెంచుకున్నారు. ఆ సినిమా తర్వత సౌత్ ఇండియన్ సినిమా కు మంచి గుర్తింపు వచ్చిందని, ఆ క్రెడిట్ మొత్తం రాజమౌళికే దక్కుతుంది. ఆయన వల్లే దక్షిణాది చిత్రాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి అని చెప్పుకొచ్చారు.