నోట్ల రద్దు అంశంపై రాష్ట్ర మంత్రి కేటీఆర్ మరోసారి స్పందించారు. నోట్లరద్దు దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపించిందని అన్నారు. ఇటీవల ఆర్బీఐ విడుదల చేసిన నివేదికను పేర్కొంటూ విష్ణువర్దన్‌రెడ్డి అనే వ్యక్తి చేసిన ట్వీట్‌కు కేటీఆర్ స్పందించారు. నోట్ల రద్దు నిర్ణయం ఘోర వైఫల్యమని విమర్శించారు. ఎదుగుతున్న భారత ఆర్థిక వ్యవస్థను నోట్ల రద్దు నిర్ణయం తీవ్రంగా దెబ్బతీసిందని వ్యాఖ్యానించారు. సగం సగం ఆలోచనల వల్ల 8 త్రైమాసికాలు మందగమానికి గురయ్యాయని తెలిపారు. నోట్ల రద్దుకు తోడు 2020 లాక్‌డౌన్ వల్ల శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థకు గట్టి దెబ్బ తగిలిందని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.
మరోవైపు కేటీఆర్ చేసిన మరో ట్వీట్‌కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. త్రో బ్యాక్ మండే అంటూ కేటీఆర్ 20 ఏళ్ల క్రితం నాటి తన ఫొటోను ప్రస్తుతం ఫొటోలను కలిపి పోస్టు చేశారు. ఈ ఫొటోలను చూసి అప్పుడు ఇప్పుడు మీరే యంగ్ అన్నా, ఎవర్గ్రీన్ యంగ్ అంటూ కేటీఆర్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
What a colossal failure this Demonetisation was & let’s not forget how it crippled the growing Indian economy
This half-baked idea led to 8 consecutive quarters of slowdown, subsequently landing in Lockdown in 2020 serving a body blow to the vibrant economy https://t.co/8fW8f1pjoN
— KTR (@KTRTRS) November 7, 2022
#20YearsAgo & Now 😁#Throwback pic.twitter.com/D0RFwUdPX5
— KTR (@KTRTRS) November 7, 2022