రాజమౌళి బాలీవుడ్ స్టార్స్‌ని ఫుల్లుగా వాడేస్తున్నాడు. అక్కడి టాప్ హీరోల ఇమేజ్‌తో బిజినెస్ చేసుకుంటున్నాడు. ఇంతకుముందు అమితాబ్ బచ్చన్‌ని వాడేస్తే, ఇప్పుడు మిస్టర్ పర్ఫెక్షనిస్ట్‌ని రంగంలోకి దింపుతున్నాడు. ఆమిర్ ఖాన్ స్టార్డమ్‌తో ‘ట్రిపుల్ ఆర్’ రేంజ్‌ని మరింత పెంచాలనుకుంటున్నాడట జక్కన్న.
రాజమౌళి మేకింగ్‌లో ఎంత పర్ఫెక్ట్‌గా ఉంటాడో, ప్రమోషన్స్‌లో అంత ప్లానింగ్‌గా ఉంటాడు. నార్త్ మార్కెట్‌లో బజ్ పెంచడానికి బోల్డన్ని ట్రిక్స్ ప్లే చేస్తుంటాడు. ఇప్పుడు లార్జ్ స్కేల్‌లో తెరకెక్కుతోన్న ‘ట్రిపుల్ ఆర్’ని ఇలాగే ప్రమోట్ చేస్తున్నాడు. జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్ మల్టీస్టారర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాని నార్త్ ఆడియన్స్‌కి స్ట్రాంగ్‌గా కనెక్ట్ చెయ్యడానికి ఆమిర్‌ఖాన్‌ని దింపుతున్నాడట రాజమౌళి.
హిస్టారికల్ డ్రామాగా వస్తోంది ‘ట్రిపుల్ ఆర్’. అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ పాత్రల నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ ఒక కీ రోల్ ప్లే చేస్తున్నాడు. ఆలియా భట్ చరణ్‌కి జోడీగా నటిస్తోంది. ఇప్పుడు వీళ్లతో పాటు ఆమిర్ ఖాన్ కూడా ఉంటే ‘ట్రిపుల్ ఆర్’కి మరింత ప్లస్ అవుతుందనుకుంటున్నాడట జక్కన్న. అందుకే ఆమిర్‌తో ‘ట్రిపుల్ ఆర్’ లో క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్‌కి వాయిస్ ఓవర్ చెప్పించాలనుకుంటున్నాడట రాజమౌళి.
‘బాహుబలి’ని కూడా నార్త్ ఆడియన్స్‌కి దగ్గర చెయ్యడానికి ఇలాంటి స్ట్రాటజీసే ప్లే చేశాడు రాజమౌళి. ‘బాహుబలి-1’ ట్రైలర్ రిలీజ్ అయ్యాక అమితాబ్ బచ్చన్ రియాక్షన్ తీసుకున్నారు. ఇక బిగ్‌బి కాంప్లిమెంట్స్‌తో ‘బాహుబలి-1’కి నార్త్‌లో మంచి బజ్ వచ్చింది. ఇప్పుడు ‘ట్రిపుల్ ఆర్’కి ఆమిర్ ఖాన్ వాయిస్ ఇస్తే ఇలాగే క్రేజ్ పెరుగుతుంది అనుకుంటున్నాడట రాజన్న.