ప్రభాస్ బలం చూసి రాజమౌళి కూడా ఖంగు తిన్నాడు !

-

‘బాహుబలి’ పుణ్యమా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ దేశంలోనే పాన్ ఇండియా సూపర్ స్టార్ హీరోగా మారిపోయాడు. దేశ స్థాయి లో మరియు అంతర్జాతీయ స్థాయిలో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రభాస్ కి ఉన్నంత మార్కెట్ మరో హీరోకి లేదు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ నటించిన బాహుబలి సినిమా ప్రభాస్ కెరీర్ ని ఫుల్ గా మార్చేసింది.

ప్రభాస్ ఓకే అంటే ఇప్పటికిప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న డైరెక్టర్లు సినిమా చేయడానికి రెడీగా ఉన్నారు. ఇటువంటి తరుణంలో ప్రభాస్ నటించిన ‘సాహో’ సినిమా దక్షిణాది సినిమా రంగంలో అన్ని భాషల్లో ఫ్లాప్ అయినా గాని బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా యావరేజ్ టాక్ వచ్చినా బాక్సాఫీసు దగ్గర మాత్రం రికార్డు స్థాయిలో కలెక్షన్ సాధించడంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో మన స్టార్ హీరోలు ప్రభాస్ మార్కెట్ చూసి బెంబేలెత్తినట్లు సమాచారం.

 

అయితే సాహో సినిమా ఓవర్సీస్లో ఫ్లాప్ అవడంతో దారుణంగా సినిమా కొన్న డిస్ట్రిబ్యూటర్లు లాస్ అవటంతో ప్రభాస్ ఓవర్సీస్ మార్కెట్ పడిపోయిందని టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా టాక్ అప్పట్లో వచ్చిన నేపథ్యంలో తాజాగా ప్రభాస్ గురించి ఒక వార్త తెలుసుకుని డైరెక్టర్ రాజమౌళి కంగు తిన్నారట. మేటర్ లోకి వెళితే ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో పీరియాడికల్ లవ్ స్టొరీలో ప్రభాస్ సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసినదే. యూవీ క్రియేషన్స్ నేపధ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ సగం పూర్తి కాకముందే ఓవర్సీస్లో రికార్డు స్థాయిలో బిజినెస్ చేసినట్లు ఆ బిజినెస్ గురించి వార్తలు విని ప్రభాస్ కి ఓవర్సీస్ లో బలం తగ్గలేదు అని రాజమౌళి అన్నట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వినబడుతున్నాయి. 

Read more RELATED
Recommended to you

Exit mobile version