యూపీ దెబ్బకు… కేసీఆర్ కలలో ఇక మోడీ వస్తాడు : రాజాసింగ్

-

యూపీ ఎన్నికల ఫలితాలపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. యూపీ దెబ్బకు… కేసీఆర్ కలలో ఇక మోడీ వస్తాడని ఎద్దేవా చేశారు రాజాసింగ్. దౌర్జన్యాలు, అన్యాయాల పై యోగి.. ఉక్కుపాదం మోపాడని.. ప్రజా సంక్షేనానికి కృషి చేసాడు… యోగి గెలవాలని యావత్ భారత్ కోరుకుందని రాజాసింగ్‌ పేర్కొన్నారు.


తెలంగాణ లో కూడా ఇవే ఫలితాలు రిపీట్ అవుతాయని.. కేసీఆర్ కి కలలో కూడా మోడీ వస్తున్నాడు… ఉలిక్కిపడుతున్నాడని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పని దేశంలో అయిపోయింది… తెలంగాణ లో కూడా ఈసారి ఖతం అవుతుందన్నారు. తెలంగాణ లో బీజేపీ అధికారంలోకి వస్తుందని దీమా వ్యక్తం చేశారు రాజాసింగ్‌. mim బ్లాక్ మెయిల్ పార్టీ… డబ్బులు ఇస్తారా.. అభ్యర్థి ని నిలబెట్టాలా అని బెదిరిస్తుందని నిప్పులు చెరిగారు. తెలంగాన రాష్ట్రంలో.. టీఆర్‌ఎస్‌ పార్టీని ఓడించి.. అధికారంలోకి వస్తామని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version