శాసన సభలో భాజపా తరుపున ఉన్న ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ తెలుగులో మాట్లాడి తన తోటి సభ్యులను ఆకట్టుకున్నారు. ఆదివారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో తాను తెలుగులోనే మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నానని చెప్పారు. తెలంగాణలో తెలుగే మాట్లాడుదాం…అంటూ తోటి ఎమెల్యేలు ఆయనకు సూచించారు. గవర్నర్ ప్రసంగం అద్భుతంగా ఉంది.. సభలో గవర్నర్ ప్రసంగంలోని అంశాల గురించి మాట్లాడాలేకానీ కొందరు ఎమ్మెల్యేలు రాజకీయాల గురించి మాట్లాడారన్నారు. పార్టీని నమ్ముకుని పదవులు చేపట్టాలి అంతే కానీ ఏపార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నేతల కాళ్లు పట్టుకోవడం తగదన్నారు. అవకాశాల కోసం కాళ్లు పట్టుకుంటారు ..వారి అవసరం తీరిన తర్వాత కాళ్లు గుంజుతారంటూ పేర్కొన్నారు. గతంలో సీఎం చేసిన వాగ్దానాలను నిలబెట్టుకుని ప్రజలను ఆదుకోవాలని కోరారు.