కొమురవెల్లి మల్లన్న భక్తులకు అలర్ట్… మూల విరాట్ దర్శనం తాత్కాలిక నిలిపివేయనున్నారట ఆలయ అధికారులు. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల అయినట్లు సమాచారం. కొమురవెల్లి మల్లన్న మూల విరాట్ దర్శనం… డిసెంబర్ 22 అంటే ఈనెల 22 నుంచి 29వ తేదీ వరకు… తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆలయ ఈవో బాలాజీ అధికారిక ప్రకటన చేశారట.
కొమురవెల్లి స్వామి వారు, అమ్మవార్ల విగ్రహాలకు పంచరంగుల అలంకరణ కోసం… దర్శనాలను తాత్కాలికంగా నిలిపి వేస్తున్నట్లు కీలక ప్రకటన చేసినట్లు తెలుస్తోంది. అధికారుల ప్రకటన ప్రకారం… డిసెంబర్ 22 నుంచి డిసెంబర్ 29వ తేదీ వరకు… కేవలం ఉత్సవమూర్తుల దర్శనం మాత్రమే… ఉంటుందని క్లారిటీ ఇచ్చారట. ఇక కొమరవెల్లి మల్లన్న మూల విరాట్ దర్శనం… డిసెంబర్ 29 నుంచి పునః ప్రారంభం కానున్నట్లు ప్రకటన వెలువడింది. దీంతో కొమురవెల్లి మల్లన్న భక్తులకు నిరాశకు గురయ్యారు.