కేసీఆర్ ను తరిమికొట్టే రోజు దగ్గర్లోనే ఉంది : రాజాసింగ్‌ వార్నింగ్‌

-

నిజాంను తరిమికొట్టిన తెలంగాణ సమాజం కెసిఆర్ ను తరిమికొట్టే రోజు దగ్గర్లోనే ఉందని.. రాజాసింగ్‌ వార్నింగ్‌ ఇచ్చారు. నిజామాబాద్ జిల్లా ఇస్సాపల్లి లో పార్లమెంట్ సభ్యులు అరవింద్ ధర్మపురి తో పాటు బీజేపీ నాయకుల పై టీఆరెస్ కార్యకర్తలు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రకటన ద్వారా రాజాసింగ్‌ తెలిపారు.

ప్రజాప్రతినిధిగా ప్రజల్లోకి వెళ్లడం రాజ్యాంగం కల్పించిన హక్కు తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాంగాన్ని పక్కనబెట్టి టిఆర్ఎస్ పార్టీ అధినేత ఇతర పార్టీల నేతలను భయపెట్టాలని చూస్తున్నారని నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో ప్రభుత్వం శాంతి భద్రతలను పూర్తిగా నిర్వీర్యం చేసింది. టిఆర్ఎస్ నాయకుల అవినీతి అక్రమాలు నిత్యకృత్యమయ్యాయని మండిపడ్డారు.

దాడులకు పాల్పడుతున్న టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను పోలీసులు పట్టించుకోకుండా ఉండడం దారుణమైన విషయమన్నారు. దాడులు టిఆర్ఎస్ కార్యకర్తలు చేస్తే బిజెపి కార్యకర్తలపై కేసులు నమోదు చేయడం దురదృష్టకరమని పేర్కొన్నారు. దాడుల వెనుక ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు కుట్ర ఉందనేది స్పష్టమని ఫైర్‌ అయ్యారు.దాడులకు పాల్పడ్డ టిఆర్ఎస్ కార్యకర్తలపై కేసులు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version