దేశంలో కరోనా కేసులు ఆగడం లేదు. తీవ్రత క్రమంగా పెరుగుతూ వస్తుంది. దీనిపై ప్రజల్లో ఇంకా భయాలు అలాగే ఉన్నాయి. వస్తుంది చలి కాలం కాబట్టి ఎలాంటి పరిస్థితి ఉంటుందో అసలు చెప్పలేము మరి. ఇక దసరా దీపావళి వంటి పెద్ద పండుగలు మన దేశంలో ఉన్నాయి. అవి కూడా చలికాలంలో ఉండటంతో ప్రజలు అందరూ కూడా కంగారు పడుతున్నారు. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు రాజస్థాన్ సిఎం తన రాష్ట్ర ప్రజలకు ఒక విజ్ఞప్తి చేసారు.
ఆరోగ్య ప్రమాదం దృష్ట్యా, ముఖ్యంగా కరోనా వైరస్ మహమ్మారి సందర్భంగా దీపావళి సందర్భంగా పటాకులు పేల్చడం మానుకోవాలని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్ శుక్రవారం ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాగా ఆ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి మెరుగ్గానే ఉంది. కాస్త తగ్గుముఖం పట్టడం అందం కలిగించే విషయం.