షాకింగ్ : లంచం అడిగినందుకు లారీతో గుద్ది నలుగురు అధికారులను చంపిన డ్రైవర్..!

-

రాజస్థాన్ లో దారుణం చోటు చేసుకుంది. రాజస్థాన్ లోని ఒక లారీ డ్రైవర్ ను ఆర్ టి ఓ అధికారులు ఆపి లారీని చెక్ చేసారు. అయితే తన వద్ద అన్ని కరెక్ట్ గానే ఉన్నాయని అయినా లంచం అడిగారని డ్రైవర్ ఆరోపిస్తున్నాడు. లారి డ్రైవర్ దగ్గర పేపర్లు అన్ని కరెక్ట్ గానే ఉన్నా చూపించినా కూడా అధికారులు వదలలేదని … దాంతోో లారీ డ్రైవర్ కు కోపం వచ్చి తన లారీతో అర్ డీ ఓ కారును ఢీ కొట్టినట్టు తెలుస్తోంది.

ఈ ఘటనలో నలుగురు అధికారులు చనిపోయినట్టు సమాచారం. అనంతరం డ్రైవర్ నేరుగా సమీప పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయినట్టు తెలుస్తోంది. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది. లారీ డ్రైవర్ పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. లారీ డ్రైవర్ లంచం అడిగిన కారణంగానే ఈ దారుణానికి పాల్పడ్డాడా లేదంటే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అన్న దిశగా పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version