ప్రముఖ నటుడు, సూపర్ స్టార్ రజనీ కాంత్ సంచలన ప్రకటన చేసారు. తాను కొత్త పార్టీ పెడుతున్నా అని ఆయన తన ట్విట్టర్ లో ప్రకటించారు. రజనీ ఫాన్స్ కి ఆయన న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చారు. డిసెంబర్ 31 న పార్టీ వివరాలను వెల్లడిస్తా అని ఆయన పేర్కొన్నారు. రాజకీయ పార్టీపై ఆయన ఎట్టకేలకు ఒక నిర్ణయం తీసుకుని ప్రకటన చేసేసారు. అయితే ఆయన పార్టీ పేరు మాత్రం ఇంకా ప్రకటించలేదు.
జనవరి నుంచి తన పార్టీ రంగంలోకి దిగుతుంది అని ఆయన స్పష్టం చేసారు. 2021 ఎన్నికల్లో తాను పోటీ చేస్తా అని ఆయన స్పష్టం చేసారు. ఎప్పటి నుంచో రజనీ కాంత్ రాజకీయ రంగ ప్రవేశంపై ఎన్నో అనుమానాలు ఉన్న సంగతి తెలిసిందే. బిజెపిలో చేరే అవకాశం ఉంది అనే ప్రచారం కూడా జరిగింది.
ஜனவரியில் கட்சித் துவக்கம்,
டிசம்பர் 31ல் தேதி அறிவிப்பு. #மாத்துவோம்_எல்லாத்தையும்_மாத்துவோம்#இப்போ_இல்லேன்னா_எப்பவும்_இல்ல 🤘🏻 pic.twitter.com/9tqdnIJEml— Rajinikanth (@rajinikanth) December 3, 2020