రజనీకాంత్ ‘లాల్ సలామ్’ తెలుగు ట్రైలర్ విడుదల

-

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా తన కూతురు ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వంలో తాజాగా రూపొందుతున్న చిత్రం లాల్ సలాం.ఈ చిత్రంలో విష్ణు విశాల్, విక్రాంత్ తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన టైటిల్ పోస్టర్ కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుంది. ఈ చిత్రం ఈ నెల ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజాగా ఈ మూవీ తెలుగు ట్రైలర్ విడుదలైంది. ఈ సినిమాలో రజనీ.. మొయిద్దీన్ భాయ్ గా కనిపించనున్నారు. ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. కపిల్ దేవ్, జీవితా రాజశేఖర్ అతిథి పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ పై సుభాస్కరన్ నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన టైటిల్ పోస్టర్ కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుంది. ఇక గతేడాది రజనీకాంత్ నటించిన  జైలర్ సినిమా  బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news