తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ రంగ ప్రవేశానికి అంతా సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ నెల 31న ఆయన పార్టీ పేరు ప్రకటిస్తానని కొద్ది రోజుల క్రితం పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే రజనీ పార్టీకి ఆటో గుర్తు కేటాయించినట్లు సమాచారం అందుతోంది. అలాగే ఆయన పార్టీ పేరు మక్కల్ సేవై కర్భీ గా నామకరణం చేసినట్లు చెబుతున్నారు. రజనీకాంత్ కు సన్నిహితంగా ఉండే ఒక వ్యక్తి పేరు మీద ఈ పార్టీ రిజిస్టర్ అయినట్లు చెబుతున్నారు.
నిజానికి రజనీకాంత్ పేరుమీద పార్టీ ఉండాలని చాలా మంది భావించారు అయితే వాటన్నిటినీ తోసిపుచ్చి రజనీకాంత్ తన సన్నిహితుడు పేరు మీద పార్టీ రిజిస్టర్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అదీ కాక బాషా సినిమాలో ఆటో డ్రైవర్ గా నటించి మెప్పించిన తీరు జనానికి ఇంకా గుర్తుండే ఉంటుంది. జనాలు ఖచ్చితంగా దానితో రిలేట్ అవడం ఖాయంగా చెబుతున్నారు. ఇక మక్కల్ సెవై అంటే ప్రజా సేవ అని అర్దం అని అంటున్నారు.