రజినీ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్…పెద్దన్న గా సూపర్ స్టార్..!

0
79

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అన్నాత్తే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను నిన్న విడుదల చేశారు. కాగా ఈ టీజర్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కబోతున్న ట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమా తెలుగులో కూడా డబ్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో దసరా సందర్భంగా తాజాగా తెలుగు టైటిల్ ను విడుదల చేశారు. అన్నాత్తే పేరుతో వస్తున్న సినిమాను తెలుగులో పెద్దన్న పేరుతో విడుదల చేస్తున్నారు.

ఈ సినిమా బ్రదర్ సిస్టర్ సెంటిమెంట్ నేపథ్యంలో తెరకెక్కుతున్నట్టు సమాచారం. దాంతో సినిమాకు పెద్దన్న టైటిల్ ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో రజనీకాంత్ కు జోడీగా నయనతార హీరోయిన్ గా నటించింది. అదేవిధంగా సినిమాలో జగపతి బాబు, కుష్భు, ప్రకాష్ రాజ్ లాంటి నటీనటులు కీలకపాత్రలో పోషించారు. ఇక తాజాగా విడుదల చేసిన రజనీకాంత్ పెద్దన్న పోస్టర్ లో మాస్ లుక్ లో కనిపిస్తున్నారు. బుల్లెట్ బండి పై సూపర్ స్టార్ బుల్లెట్ బండెక్కి వచ్చేస్తా అంటున్నారు. మరి పెద్దన్న ఎలాంటి విజయం అందుకుంటాడో చూడాలి.