BREAKING : ఆసుపత్రి నుండి సాయి ధరంతేజ్ డిశ్చార్జ్..!

టాలీవుడ్ యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఇక సెప్టెంబర్ 10న సాయి ధరమ్ తేజ్ కు యాక్సిడెంట్ అవ్వడంతో ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. తీవ్ర గాయాలు అవ్వడం తో ఆయన ఆస్పత్రిలో చేరారు. అంతేకాకుండా తేజ్ కు కాలర్ బోన్ సర్జరీ జరిగింది. దాంతో ఇంత కాలం ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. ఎట్టకేలకు సాయి ధరంతేజ్ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయినట్టు సమాచారం. దాదాపు 35 రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స తీసుకొని తేజ్ ఇంటికి వచ్చారని మెగాస్టార్ చిరంజీవి తన ట్విట్టర్లో పేర్కొన్నారు.

ఇది నీకు పునర్జన్మ ఈ దసరా పండగకు పూర్తిగా కోలుకుని ఆసుపత్రి నుండి ఇంటికి చేరుకున్నావు. ఇది నిజంగా అద్భుతం సాయి ధరమ్ తేజ్ పెను ప్రమాదం నుంచి తప్పుకున్నాడు అంటూ మెగాస్టార్ పేర్కొన్నారు. సాయి ధరమ్ తేజ్ కు పెద్ద అత్త… పెద్ద మామ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు.. అంటూ మెగాస్టార్ ట్వీట్ చేశారు. ఇక మెగాస్టార్ చేసిన ట్వీట్ తో సాయిధరమ్ తేజ్ అభిమానులు తమ హీరో ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయినందుకు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.