ఎలా వచ్చిందో గాని..చిరంజీవికి రాజ్యసభ పదవి ఇస్తున్నారని ఏపీ రాజకీయాల్లో అనూహ్యంగా ప్రచారం వచ్చిన విషయం తెలిసిందే. సినిమా టిక్కెట్ల అంశంపై జగన్‌తో చర్చ చేసిన తర్వాతే రోజే…చిరంజీవికి వైసీపీ ఎంపీ పదవి ఇస్తున్నారని మీడియాలో కథనాలు వచ్చేశాయి. అయితే వెంటనే చిరు స్పందించి..తాను మళ్ళీ రాజకీయాల్లోకి రానని, అవన్నీ ఊహాగానాలే అని కొట్టిపారేశారు. అంటే చిరుకు రాజ్యసభ లేదని క్లియర్ అయిపోయింది.
ఇక నాలుగు పదవులు వైసీపీకే దక్కనున్నాయి. మళ్ళీ విజయసాయికి రాజ్యసభ పదవి దక్కడం ఖాయం. మరి బీజేపీ ఏమన్నా సురేష్ ప్రభుకు మళ్ళీ పదవి అడిగితే…వైసీపీ ఇచ్చే ఛాన్స్ ఉంది. అలాగే సినీ నటుడు మోహన్‌బాబుకు కూడా రాజ్యసభ దక్కే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. మరి ఇంతవరకు వైసీపీలో మోహన్‌బాబుకు అయితే పదవి దక్కలేదు.
అలాగే మోహన్‌బాబుకు పదవి ఇవ్వకపోతే…కమ్మ వర్గానికి చెందిన మర్రి రాజశేఖర్‌కు పదవి ఇచ్చే అవకాశం ఉంది. ఇక కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి సైతం రాజ్యసభ రేసులో ఉన్నారని టెలూస్తోంది. ఇక టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన చలమలశెట్టి సునీల్, బీదా మస్తాన్ రావులు సైతం రాజ్యసభ రేసులో ఉన్నారని చెప్పొచ్చు. మరి వైసీపీలో రాజ్యసభ ఆఫర్ ఎవరికి దక్కుతుందో చూడాలి.