5 గ్రీన్ ఫీల్డ్ కారిడార్ ప్రాజెక్టులు… ఏపీకి కేంద్ర మంత్రి గ‌డ్క‌రీ గుడ్ న్యూస్

-

ఆంధ్ర ప్ర‌దేశ్ కు కేంద్ర ర‌హ‌దారుల శాఖ మంత్రి నిత‌న్ గ‌డ్క‌రీ గుడ్ న్యూస్ చెప్పారు. భార‌త్ మాల ప‌రియోజ‌న తొలి ద‌శ కింద ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఐదు గ్రీన్ ఫీల్డ్ కారిడార్ ప్రాజెక్ట్ ల‌ను ప్రారంభించిన‌ట్టు కేంద్ర ర‌హ‌దారుల శాఖ మంత్రి నిత‌న్ గ‌డ్క‌రీ తెలిపారు. ఈ రోజు రాజ్య స‌భ‌లో వైసీపీ ఎంపీ విజ‌య సాయి రెడ్డి అడిగిన ప్ర‌శ్న‌కు స‌మాధానంగా కేంద్ర మంత్రి నిత‌న్ గ‌డ్క‌రీ గ్రీన్ ఫీల్డ్ కారిడార్ ప్రాజెక్ట్ ల‌పై ప్ర‌క‌ట‌న చేశారు.

ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో చేప‌డుతున్న ఈ ఐదు గ్రీన్ ఫీల్డ్ కారిడార్ ప్రాజెక్ట్ లను 2026 – 27 వ‌ర‌కు పూర్తి చేస్తామ‌ని తెలిపారు. కాగ ఏపీకి రాబోతున్న ఐదు గ్రీన్ ఫీల్డ్ కారిడార్ ప్రాజెక్ట్ వివ‌రాలు ఇలా ఉన్నాయి.

1) విశాఖ ప‌ట్నం నుంచి రాయ‌పూర్ మ‌ధ్య 99.63 కిలో మీట‌ర్ల‌తో నిర్మించ‌నున్నారు. ఆరు వ‌రస‌ల జాతీయ రాహ‌దారికి రూ. 3,183 కోట్ల‌ను కేంద్ర ప్ర‌భుత్వం కేటాయించారు.

2) ఖ‌మ్మం నుంచి దేవ‌రాప‌ల్లి వ‌ర‌కు 56 కిలో మీట‌ర్లు. నాలుగు వ‌రస‌ల జాతీయ రహ‌దారికి రూ. 1,281 కోట్లు కేటాయించారు.

3) చిత్తూర్ నుంచి థాట్చూర్ వ‌ర‌కు 96 కిలో మీట‌ర్లు. ఆరు వ‌రస‌ల జాతీయ ర‌హ‌దారికి రూ. 3,179 కోట్లు.

4) బెంగ‌ళూర్ నుంచి చెన్నై వ‌ర‌కు 85 కిలో మీట‌ర్లు. ఈ ఎక్స్ ప్రెస్ వేకు రూ. 4,137 కోట్లు.

5) బెంగ‌ళూర్ నుంచి విజ‌యవాడ 343 కిలో మీట‌ర్లు. దీనికి అయ్యే వ్య‌యంపై రిపోర్టు తాయ‌రు అవుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version