కరోనా దెబ్బకు 5 వేల కోట్లు నష్టపోయిన రాఖీ పండుగ, ఎలా అంటే…!

-

రాఖీ పండుగ అనగానే చాలా మంది నోరు తీపి చేసుకోవడానికి స్వీట్స్ కొనుగోలు చేస్తూ ఉంటారు. సోదరి రాఖీ కట్టిన వెంటనే నోట్లో స్వీట్ పెట్టడం ఆనవాయితీ. మొత్తం కుటుంబ సభ్యులు అందరికి స్వీట్ తినిపిస్తూ ఉంటారు. ప్రపంచంలో ఎక్కడ అయినా సరే ఇది ఉంటుంది. కాని ఇప్పుడు ఆ స్వీట్స్ కి కరోనా దెబ్బ తగిలింది గట్టిగా… కరోనా దెబ్బకు స్వీట్స్ ఎవరూ కొనడం లేదు. కరోనా స్వీట్స్ మీద ఉంటుంది అనే భయంతో ఎవరూ స్వీట్స్ కొనడం లేదు.

కీ చైన్ లు చిన్న చిన్న గిఫ్ట్ లు అది కూడా ఆన్లైన్ లో ఆర్డర్ చేస్తున్నారు. దీనితో స్వీట్స్ పరిశ్రమ చాలా దారుణంగా నష్టపోయింది. దేశ వ్యాప్తంగా స్వీట్స్ షాపులు 5 వేల కోట్లు నష్టపోయాయి అని నిపుణులు అంచనా వేస్తున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా రాఖీ పండుగకు స్వీట్ కావాలి అంటే ఇంట్లో చేసుకుంటున్నారు గాని ఎవరూ స్వీట్స్ కొనుగోలు చేసే పరిస్థితి లేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version