రక్షాబంధన్ నాడు అక్క, చెల్లెళ్లు తమ అన్నదమ్ములు రాఖీలు కట్టుకొని బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. అయితే ఈ రక్షా బంధన్ కి మీ సోదరుడు కి ఏ గిఫ్ట్ ఇవ్వాలి అని ఆలోచిస్తున్నారా…? అయితే ఇక్కడ కొన్ని గిఫ్టింగ్ ఐడియాస్ ఉన్నాయి. మరి ఆలస్యం ఎందుకు వాటి కోసం కూడా పూర్తిగా చూసేయండి.
గ్రూమింగ్ కిట్:
మెన్స్ కి ఇది బాగా ఉపయోగపడుతుంది. అన్ని రకాల పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ ని కలిపి మీరు గిఫ్ట్
ప్యాక్ చేసి ఇవ్వచ్చు. ఇది నిజంగా వాళ్లకి చాలా బాగా నచ్చుతుంది.
నెట్ ఫ్లిక్స్ ప్లాన్:
ఇప్పుడు అంతా కూడా ఓటిటి నడుస్తోంది. కాబట్టి మీరు మీ సోదరుడికి నెట్ ఫ్లిక్స్ ప్లాన్ ని రక్షాబంధన్ గిఫ్ట్ కింద ఇవ్వచ్చు. ఇలా సబ్స్క్రిప్షన్ తీసుకోవడం వల్ల వాళ్ళకి బెనిఫిట్ గా ఉంటుంది.
వర్క్ ఫ్రమ్ హోమ్ కిట్:
చాలా మంది ఇప్పుడు ఇంట్లో వుండే వర్క్ చేస్తున్నారు కాబట్టి వర్క్ ఫ్రొం హోమ్ కి అవసరమయ్యే సామాన్లన్నీ వాళ్ళకి ఇవ్వొచ్చు. అంటే స్టేషనరీ సామాన్లు, స్పీకర్లు మొదలైనవి మీరు వాళ్ళకి బహుమతిగా ఇవ్వొచ్చు ఇది కూడా తప్పకుండా మీ సోదరుడికి బాగా నచ్చుతుంది.
ఆన్లైన్ గిఫ్ట్ వోచర్:
ఏదైనా ఈ కామర్స్ సైట్ లో షాపింగ్ చేయాలంటే గిఫ్ట్ వోచర్ బాగా ఉపయోగపడుతుంది దీనితో తనకి నచ్చినది కొనుక్కుంటారు. కాబట్టి ఇలా కూడా మీరు ఇవ్వచ్చు. ఇలా అద్భుతమైన గిఫ్ట్స్ తో ఈ రక్షా బంధన్ ని గుర్తుండిపోయేలా జరుపుకోండి.