వారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తూ రకుల్ ప్రీత్ సంచలన ట్వీట్…..!!

-

టాలీవుడ్ సినిమా పరిశ్రమలు కెరటం అనే సినిమాతో అడుగుపెట్టిన రకుల్ ప్రీత్ సింగ్, తొలిసినిమాతో సక్సెస్ సాదించనప్పటికీ, తన అందం మరియు అభినయంతో పర్వాలేదనిపించింది. ఆ తరువాత సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాలో హీరోయిన్ గా నటించి ఫస్ట్ హిట్ ని అందుకుంది. అనంతరం లౌక్యం, నాన్నకు ప్రేమతో, పండగ చేస్కో సినిమాలతో మంచి సక్సెస్ లు అందుకున్న రకుల్, అక్కడి నుండి వరుసగా పలువురు టాలీవుడ్ స్టార్ హీరోల సరసన అవకాశాలు సంపాదించింది.

అయితే ఆ తరువాత ఆమె నటించిన సినిమాల్లో చాలావరకు ఫ్లాప్ అయ్యాయి. అలానే ఆమెకు అటు తమిళ పరిశ్రమలో కూడా సక్సెస్ లభించలేదు. అలానే కొన్ని బాలీవుడ్ సినిమాల్లో కూడా నటించి తన అదృష్టాన్ని పరీక్షించుకున్న రకుల్ కు అక్కడ మిశ్రమ స్పందన లభించింది. కాగా ఇటీవల తాను రెండు తెలుగు సినిమాల్లో అవకాశం సంపాదించినట్లు ఆమె చెప్పారు. కాగా ఆ వివరాలు అతి త్వరలో అధికారికంగా వెల్లడి కానున్నట్లు తెలుస్తోంది. ఇక కొద్దిరోజుల నుండి రకుల్ కు టాలీవుడ్ లో అవకాశాలు లేకపోవడంతో ఆమె హైదరాబాద్ లో తనకు గిఫ్ట్ గా లభించిన  సొంత ఇంటిని అమ్మి,

బెంగుళూరు వెళ్ళిపోయి అక్కడ ఒక పెద్ద భవంతిని కొనుగోలు చేసినట్లు వార్తలు వచ్చాయి. కాగా ఆ వార్తలపై నిన్న కొంత ఘాటుగా స్పందించిన రకుల్, తనకు హైదరాబాద్ లో ఇల్లు ఎవరూ గిఫ్ట్ గా ఇవ్వలేదని, అది తాను కష్టపడి సంపాదించుకున్న ఇల్లు అని, దయచేసి ఇటువంటి తప్పుడు వార్తలు సృష్టించవద్దని తన ట్విట్టర్ వేదికగా ఒక ట్వీట్ ని పోస్ట్ చేసింది రకుల్. కాగా ఆమె పోస్ట్ ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది….!!

Read more RELATED
Recommended to you

Exit mobile version