Ram Charan: విదేశీ పత్రిక మొదటి పేజీలో రామ్ చరణ్..RRRలోని అల్లూరి స్టిల్ పబ్లిష్

-

టాలీవుడ్ దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన RRR పిక్చర్ ఈ ఏడాది మార్చి 25న విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఇప్పటికీ సక్సెస్ ఫుల్ గా థియేటర్స్ లో రన్ అవుతోంది. ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ తారక్ ప్రధాన పాత్రలు పోషించారు.

అల్లూరి సీతారామరాజు పాత్రకు రామ్ చరణ్ ప్రాణం పోశారని సినిమా చూసి మెగా అభిమానులు కాంప్లిమెంట్స్ ఇచ్చారు. బాలీవుడ్ సైతం రామ్ చరణ్ యాక్టింగ్ కు ఫిదా అయిపోయింది.

అల్లూరి సీతారామ రాజు గెటప్ లో ఉన్న రామ్ చరణ్ ను చూసిన మెగా అభిమానులు అదే వేషం వేసుకుని హైదరాబాద్ లో సినిమా రిలీజ్ సందర్భంగా సందడి కూడా చేశారు. కాగా, తాజాగా నేపాల్ దేశానికి చెందిన ప్రముఖ పత్రిక మొదటి పేజీలో రామ్ చరణ్ పోస్టర్ వేశారు.

RRR చిత్రంలోని రామ్ చరణ్ అల్లూ రి సీతారామ రాజు లుక్ ఉన్న పోస్టర్ వేశారు. అది చూసి మెగా ఫ్యాన్స్ మాత్రమే కాదు సినీ లవర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాజమౌళి తెరకెక్కించిన విజ్యువల్ వండర్ RRRలో రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ ఆలియా భట్ నటించింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version