రామ్ చరణ్ కూడా ఇల్లు తుడిచేసేసాడు..ఈ సారి ఎవ్వరో …?

-

ఇప్పుడు టాలీవుడ్ లో అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా చేసిన ఛాలెంజ్ హవా కొనసాగుతుంది. సోషల్ మీడియా వేదికగా టాలీవుడ్ హీరోలు ఇప్పుడు ఈ ఛాలెంజ్ ని స్వీకరిస్తున్నారు. రాజమౌళి తన ఇంట్లో పని చేసి దానికి రామ్ చరణ్ ని, జూనియర్ ఎన్టీఆర్ ని నామినేట్ చేసారు. జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికే దీనికి స్పందించి దానికి గానూ బాలకృష్ణ, నాగార్జున, చిరంజీవి, కొరటాల శివ ని నామినేట్ చేసారు.

దీనికి రామ్ చరణ్ స్పందించారు. రాజమౌళి గారూ… ఇంట్లో పనులను చేయడంలో గర్వపడదామని ఆయన ట్వీట్ చేసారు. నిజమైన పురుషులుగా ఉండి, పని భారాన్ని పంచుకోవడం ద్వారా మహిళలకు సహాయం చేద్దామని రామ్ చరణ్ పేర్కొన్నాడు. #BetheREALMAN అనే ట్యాగ్ ని ఉపయోగించాడు. తర్వాత దీనికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ని నామినేట్ చేసాడు.

అలాగే బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ ని, ఇక కండల వీరుడు రానాను ట్యాగ్ చేసాడు. యువ హీరో శర్వానంద్ ని కూడా నామినేట్ చేసాడు. ఈ సందర్భంగా తాను ఇంట్లో పని చేస్తున్న వీడియో ని షేర్ చేసాడు. ఈ వీడియోని ఇప్పుడు మెగా ఫాన్స్ భారీగా షేర్ చేస్తున్నారు. ఇతర హీరోలు కూడా దీనికి స్పందిస్తారా లేదా అనేది చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version