తెలుగు సినీ పరిశ్రమలో విభిన్నమైన కథలు ఎంచుకునే డైరెక్టర్లలో కొరటాల శివ ఒకరిని చెప్పవచ్చు..డైరెక్టర్ కొరటాల శివ, చిరంజీవి, రామ్ చరణ్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం ఆచార్య. ఇందులో హీరోయిన్ గా పూజ హెగ్డే నటించింది.ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద గోరంగా పరాజయాన్ని చవిచూసింది. అయితే తాజాగా ఆచార్య సినిమా ఫ్లాప్ గురించి రామ్ చరణ్ మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. RRR సినిమా హిట్ తర్వాత నటించిన ఆచార్య సినిమా ప్రేక్షకులు చూడడానికి ఎక్కువగా రాలేదని కూడా తెలియజేశారు రామ్ చరణ్. అయితే ప్రేక్షకులు కంటెంట్ బాగుంటేనే థియేటర్లకు వచ్చి చూస్తున్నారని కూడా తెలియజేయడం జరిగింది.
కంటెంట్ బాగా లేకపోతే ప్రేక్షకులు సినిమాను చూడడానికి రారు అని చెప్పడానికి ఇదే సాక్ష్యం అని తెలియజేశారు. ముఖ్యంగా రామ్ చరణ్ కు డస్ట్ ఎలర్జీ వల్ల తను బాల్యంలో సర్జరీలు చేయించుకున్నారని కూడా తెలియజేశారు. ఈ విషయం తెలిసిన అభిమానులు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. ఇక అంతే కాకుండా RRR సినిమాలోని మొదటి సన్నివేశం కోసం దుమ్ము దూలిలో దాదాపుగా 30 రోజులపాటు పాల్గొనవలసి వచ్చిందని తెలిపారు. కేవలం డైరెక్టర్ రాజమౌళి వల్లే ఆసిన్ చాలా అద్భుతంగా వచ్చిందని తెలియజేశారు రామ్ చరణ్. ఇలాంటి సన్నివేశాలు ఆచార్య మూవీలో ఎక్కడా కనిపించలేదని అందుచేతనే ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయిందని చెప్పగానే చెప్పేశారు రామ్ చరణ్.
కానీ డైరెక్టర్ కొరటాల శివ మాత్రం ఇప్పటివరకు ఎక్కడ కూడా ఆచార్య సినిమా ఫలితం గురించి ఏ విధంగా మాట్లాడలేదు. మరి రాబోయే రోజుల్లో ఈ చిత్ర ఫలితం పైన స్పందిస్తారేమో చూడాలి. అయితే కేవలం ఆచార్య సినిమా ఫ్లాప్ కావడంతో చాలామంది సినీ ప్రముఖుల జీవితాలు ఒకసారిగా తలకిందులయ్యాయని చెప్పవచ్చు. ప్రస్తుతం రామ్ చరణ్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.