టాలీవుడ్ మెగాపవర్ స్టార్ రాంచరణ్ చేసిన పని ప్రస్తుతం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఇటీవల రాంచరణ్ కడపకు వెళ్లి దర్గాను దర్శరించి అక్కడ ప్రత్యేక ప్రార్థనలు చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఆయన అయ్యప్ప మాలను ధరించి ఉన్నారు. దీనిపై అయ్యప్ప జేఏసీ నాయకులు స్పందిస్తూ.. అయ్యప్ప మాలలో ఉండి రాంచరణ్ దర్గాకు ఎలా వెళ్తారు ? ఏ ఆర్ రెహమాన్ కుట్ర పూర్వకంగానే రామ్ చరణ్‌ని దర్గాకు వెళ్లమన్నారు.
రామ్ చరణ్ రెహమాన్‌ని కూడా తిరుపతి,శబరిమలకు తీసుకురాగలరా? ఒకపక్క పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి పోరాడుతుంటే ఇంకోపక్క వాళ్ల అబ్బాయి అయ్యప్ప మాలలో దర్గాకు వెళ్ళాడు.రామ్ చరణ్ నుంచి సమాధానం కోసం నాలుగైదు రోజులు ఎదురు చూస్తాం.ఎలాంటి స్పందన లేకపోతే మా ఆందోళనను ఉధృతం చేస్తాం.రాంచరణ్ వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలి’ అని తెలంగాణ అయ్యప్ప జేఏసీ నాయకుడు డిమాండ్ చేశారు.