గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇద్దరూ స్టార్ హీరోలే. వీరి గురించి తెలియని వారెవ్వరూ ఉండరు. వీరు వరసకు బావ, బావమరిది అవుతారు. వాళ్ళిద్దరి మధ్య బంధుత్వం కంటే ఎక్కువ స్నేహం ఉండేది. ఇప్పుడు వీరి ఇద్దరి మధ్య ఏం జరిగింది? ఎందుకు అన్ ఫాలో అవుతున్నారు? అనేది అటు సినిమా ఇండస్ట్రీ ప్రముఖులతో పాటు ఇటు సామాన్య ప్రేక్షకులలోనూ హాట్ టాపిక్ అవుతోంది.
తాజాజా సోషల్ మీడియా అకౌంట్ అయినటువంటి ఇన్ స్టా గ్రామ్ లో అల్లు అర్జున్ ని రామ్ చరణ్ అన్ ఫాలో చేశారు కొద్ది రోజుల క్రితం వరకు ఆయన ఫాలో అయ్యారు. ఏమైదో ఏమో.. తాజాగా అన్ ఫాలో చేసారు. ఆ విషయం హాట్ టాపిక్ అయింది. బన్నీని అన్ ఫాలో చేసిన రెండో మెగా హీరో రామ్ చరణ్ కావడం విశేషం. రామ్ చరణ్ కంటే ముందుగానే మెగా మేనల్లుడు సుప్రీమ్ హీరో సాయి దుర్గతేజ్ సైతం బన్నీని అన్ ఫాలో చేశారు. ఏపీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి శిల్ప రవికి మద్దతుగా అల్లు అర్జున్ నంధ్యాల వెళ్లడం.. ఆ తరువాత పరిణామాల నేపథ్యంలో సాయి దుర్గ తేజ్ ఆ నిర్ణయం తీసుకున్నాడు.