RGV: ఐశ్వర్య రాయ్ ఫేక్.. ప్లాస్టిక్ బొమ్మ.. చూస్తే తట్టుకోలేరు..!

-

రాంగోపాల్ వర్మ సినిమాలు అంటే ఇదివరకు చూడడానికి ఎంతో మంది ఆసక్తిగా ఎదురు చూసే వారు రాంగోపాల్ వర్మ ఇప్పుడు మాత్రం ఎప్పటికప్పుడు వివాదాస్పద కామెంట్లు చేస్తూ వైరల్ అవుతున్నారు. రాంగోపాల్ వర్మ తాజాగా ఐశ్వర్యారాయ్ గురించి వైరల్ కామెంట్స్ చేశారు. ఐశ్వర్యారాయ్ చాలా ఫేక్ గా ఉంటుందని ఫేక్ గా మాట్లాడుతుందని ఆమె ఒక ప్లాస్టిక్ బొమ్మ అని అన్నారు. సోషల్ మీడియాలో ఆమె అందాన్ని పొగిడే వాళ్ళ సంఖ్య ఎంత ఉంటుందో తిట్టే వాళ్ళ సంఖ్య కూడా అంతే ఎక్కువ ఉంటుందని అన్నారు కానీ ఎవరు ఏమనుకున్నా ఆమె ప్రపంచ సుందరి అని అన్నారు.

ఇప్పటికి ఇండియాలో ఆమెకు ఉన్నంత అందం ఎవరికీ లేదని రాంగోపాల్ వర్మ ఐశ్వర్యరాయ్ ని పొగిడారు. పొగిడినట్లే పొగిడి ఐశ్వర్య దూరం నుండి చాలా అందంగా ఉంటుందని దగ్గరికి వెళ్లి చూస్తే ఆమెలో కొన్ని లోపాలు కనపడతాయని అవసరానికి మించి మాట్లాడుతూ అనవసరంగా నవ్వుతూ ఉంటుందని అన్నారు. కొన్నిసార్లు పక్కవాళ్ళకి ఇబ్బంది కలుగుతుందని అన్నారు ఆమెని చాలామంది ఫేక్ అంటూ ఉంటారు అని బాంబు పేల్చారు రాంగోపాల్ వర్మ.

Read more RELATED
Recommended to you

Latest news