వర్మకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల ఝలక్.. రివర్స్‌లో ట్వీట్ చేసిన వర్మ..

-

వివాదాలకు కేరాఫ్‌గా నిలిచే సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. ఎప్పుడూ వివాదాలను క్రియేట్ చేస్తూనే ఉంటారు. వాటితోనే ఆయన కాలక్షేపం చేస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల పట్ల వర్మ వేసిన జోక్ తిరిగి ఆయనకే రివర్స్‌లో వచ్చి తగిలింది.

వివాదాలకు కేరాఫ్‌గా నిలిచే సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. ఎప్పుడూ వివాదాలను క్రియేట్ చేస్తూనే ఉంటారు. వాటితోనే ఆయన కాలక్షేపం చేస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల పట్ల వర్మ వేసిన జోక్ తిరిగి ఆయనకే రివర్స్‌లో వచ్చి తగిలింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే…

పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో తాజాగా వచ్చిన ఇస్మార్ట్ శంకర్ మూవీని చూసేందుకు వర్మ హైదరాబాద్ మూసాపేటలో ఉన్న శ్రీరాములు థియేటర్‌కు చేరుకున్నారు. అయితే ఆయనతోపాటు ఆర్‌ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి, లక్ష్మీస్ ఎన్‌టీఆర్ ఫేమ్ అగస్త్య ఇద్దరు కూడా వచ్చారు. వీరు ముగ్గురూ ఓ బైక్‌పై ఆ థియేటర్‌కు వచ్చారు. అయితే అలా తాము ట్రిపుల్ రైడింగ్ చేస్తూ థియేటర్‌కు వచ్చినా.. పోలీసులు చూడట్లేదేమిటి.. వారందరూ ఇస్మార్ట్ శంకర్ మూవీకి వెళ్లారా.. అంటూ వర్మ ట్వీట్ చేశారు.

అయితే వర్మ ట్వీట్‌కు స్పందించిన సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఆ ట్వీట్‌లోని ఫొటోలో ఉన్న బైక్ నంబర్ ఆధారంగా దాని యజమానికి జరిమానా విధించారు. ట్రిపుల్ రైడింగ్, హెల్మెంట్ లేకుండా వాహనం నడిపినందుకు ఆ బైక్ యజమానికి రూ.1300 ఫైన్ వేశారు. ఈ క్రమంలో తాము బైక్‌కు వేశామని ట్రాఫిక్ పోలీసులు వర్మకు ట్వీట్ చేయగా.. ఆయన మళ్లీ స్పందించారు. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చేస్తున్న పనికి వారికి తాను ఐలవ్యూ చెబుతున్నానని.. మీరు చేస్తున్న పనికి తాను వారికి 39 రోజుల పాటు ఆగకుండా ముద్దులు పెట్టాలని అనుకుంటున్నానని.. తనకు రెండో అమ్మాయి ఉంటే వారికి ఆమెను ఇచ్చి నా అల్లుడ్ని చేసుకునే వాడ్నని వర్మ ట్వీట్ చేశారు.. దీంతో ఈ విషయం కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..!

Read more RELATED
Recommended to you

Exit mobile version