బిగ్ బ్రేకింగ్ : కేంద్ర మంత్రి రాం విలాస్ పాశ్వాన్ కన్నుమూత

-

కేంద్ర కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రి రామ్ విలాస్ పాస్వాన్ కొద్ది సేపటి క్రితం కన్ను మూశారు. ఆయన ఇటీవలే ఢిల్లీలోని ఒక ప్రముఖ ఆసుపత్రిలో గుండెకు సంబందించిన శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఐదు దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో చురుకైన పోషించిన ఆయన దేశంలోని ప్రసిద్ధ దళిత నాయకులలో ఒకరుగా పేరు తెచ్చుకున్నారు. ఆయన వయసు ప్రస్తుతం 74 సంవత్సరాలు. ఆయన మరణించిన విషయాన్ని ఆయన కుమారుడు చిరాగ్ పాస్వాన్ ట్వీట్ ద్వారా తెలిపారు. మిస్ యు పాపా అంటూ, లోక్ జనశక్తి పార్టీ (ఎల్జెపి) చీఫ్ చిరాగ్ పాస్వాన్ తన తండ్రి మరణం గురించి తెలియజేస్తూ ట్వీట్ చేశారు.

 

చిరాగ్ గత వారం కూడా ఒక ట్వీట్ చేసాడు: “చాలా రోజులుగా నాన్న ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు, శనివారం సాయంత్రం కొన్ని ఆకస్మిక పరిణామాల కారణంగా, అర్ధరాత్రి సమయంలో ఆయన గుండెకు ఆపరేషన్ చేయవలసి వచ్చింది. అవసరమైతే, బహుశా కొన్ని వారాల తరువాత మరొక ఆపరేషన్ నిర్వహించే అవకాశం ఉండవచ్చు, ఈ సమయంలో నాకు మరియు నా కుటుంబానికి అండగా నిలిచినందుకు అందరికీ ధన్యవాదాలు. అని ఆయన ట్వీట్ చేశారు. తన వ్యక్తిగత ఆరోగ్య సమస్యలు, అలానే రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ఎల్జెపి పొత్తులను ఖరారు చేయడానికి పాస్వాన్ తన కొడుకుకు పూర్తి అధికారాలు అప్పచెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version