ఏపీ సీఎంకు రామకృష్ణ లేఖ ..!

-

తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి సిపిఐ నేత రామకృష్ణ లేఖ రాశారు. పోలవరం నిర్వాసితులకు ఒక్కో కుటుంబానికి రూ. 10 లక్షల పరిహారం ఇవ్వాలని ఆయన లేక పూర్వకంగా డిమాండ్ చేశారు. వీటితో పాటు 2006 – 07 సంవత్సరంలో ఎకరాకు రూ. ఒక లక్ష 15000 తీసుకున్న వారందరికీ, మళ్లీ ఎకరాకు రూ. 5 లక్షల రూపాయలు చెల్లించాలని కోరారు. అంతేకాకుండా నిర్వాసితులకు 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువతీయువకులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అందించాలని ఆయన తెలిపారు.

cpi-ramakrishna-ys-jagan

ఈ విషయంలో కటాఫ్ డేట్ తో సంబంధం లేకుండా 18 సంవత్సరాలు నిండిన ప్రతి వారికి వర్తింపజేయాలని ఆయన తెలిపారు. అలాగే పునరావాస కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంతోపాటు వారందరినీ పూర్తి పరిహారం అందించిన తర్వాత వారిని అక్కడి నుంచి తరలించాలని తెలిపారు. ఆ తర్వాత మిగులు భూములను సర్వే చేసిన అనంతరం వారందరికీ నష్ట పరిహారం అందజేయాలని ప్రతి నిర్వాసిత కుటుంబానికి కచ్చితంగా ఉద్యోగం కల్పించాలని రామకృష్ణ జగన్ కు రాసిన లేఖలో డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version