‘RRR’పై సస్పెన్స్ పెంచుతున్న రామ్ చరణ్, తారక్ ట్విట్స్…!

-

తారక్ ,చెర్రీలతో రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ RRR. కరోనావైరస్ వల్ల ఈ సినిమా షూటింగ్ కొన్ని నెలల పాటు ఆగిపోగా ఇటీవలే మళ్లీ మొదలైంది. దాంతో ఫ్యాన్స్ ఈ మూవీకి సంబంధించిన కీలక అప్డేట్స్ కోసం తెగ వేచి చూస్తున్నారు. అయితే అక్టోబర్ 22న మంచి అప్డేట్ ఉంటుంది అని సినిమా టీమ్ కొంత కాలం క్రితమే తెలిపింది.

రామరాజుఫర్‌భీమ్‌’ పేరుతో రానున్న ఈ సర్‌ప్రైజ్‌కి సంబంధించి ఓ స్పెషల్‌ గ్లిమ్స్‌ను బుధవారం చెర్రీ ట్విటర్‌ వేదికగా విడుదల చేశారు. ‘తారక్‌ బ్రదర్‌.. నిన్ను టీజ్‌ చేసేవిధంగా ఓ స్పెషల్‌ గ్లిమ్స్‌ విడుదల చేస్తున్నా. నీలాగా కాకుండా చెప్పిన సమయానికి ‘రామ్‌రాజుఫర్‌భీమ్‌’ విడుదల చేస్తా.’అని చెర్రీ ట్వీట్‌ చేశారు. కాగా, చరణ్‌ పెట్టిన ట్వీట్‌పై తారక్‌ సరదాగా స్పందించారు. ‘సోదరా.. ఇప్పటికే ఐదు నెలలు ఆలస్యమయ్యావనే విషయాన్ని నువ్వు తెలుసుకోవాలి. జక్కన్నతో డీలింగ్‌ కాబట్టి నువ్వు కొంచెం అప్రమత్తంగా ఉండు. ఏదైనా జరగొచ్చు!! ఏది ఏమైనా.. పూర్తి వీడియో కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అని తారక్‌ రిప్లై ఇచ్చారు.

కరోనాకు ముందే చెర్రీ బర్త్ డే కానుకగా టీజర్ ను ఇచ్చి జక్కన్న ఆడియన్స్ ను సర్ఫైజ్ చేసాడు.మెగా అభిమానులు ఈ టీజర్ చూసి తెగ సంబరపడిపోయారు. యంగ్ టైగర్ సమ్మర్ లో ఇస్తాడనుకున్న బర్త్ డే ట్రీట్ ఇవ్వకపోయేసరికి… అభిమానులు హార్ట్ అయ్యారు.ఆఫ్టర్ లాక్ డౌన్ వచ్చిన వినాయక చవితికి ఫస్ట్ గ్లింప్ లేకపోయేసరికి… జక్కన్నను ట్రోల్ చేశారు.ఇపుడొచ్చే దసరాకు కూడా ఇలాగే చేస్తే ఊరుకునేది లేదంటున్నారు. ఫ్యాన్స్ ఫైర్ పసిగట్టిన రాజమౌళి… ఈసారి ఎలాగైనా భీముడిని మన ముందుకు తేవాలని చూస్తున్నాడు. ఇంతకాలం యంగ్ టైగర్ నుంచి ఎలాంటి ట్రీట్ లేక బాధపడుతోన్న ఫ్యాన్స్ కు ఈ దసరా భీముడు ఫుల్ మీల్స్ ఇవ్వడానికి మాంచి స్వింగ్ మీద రెఢీ అవుతున్నాడు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version