ఏపీ మాజీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. తనను ఎస్‌ఈసీగా తిరిగి నియమించకుండా ఏపీ సర్కారు కోర్టు ధిక్కరణకు పాల్పడుతోందని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. హైకోర్టు తీర్పును కూడా ఏపీ ప్రభుత్వం అమలు చేయడం లేదని పిటిషన్‌లో తెలిపారు.
సీఎస్, పంచాయతీ ముఖ్య కార్యదర్శి, ఎన్నికల సంఘం కార్యదర్శిని.. ప్రతివాదులుగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. బీజేపీ నేతలు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్‌ను నిమ్మగడ్డ రమేశ్ కుమార్ 13న ఓ హోటల్ లో కలిసి వీడియోలు వెలుగులోకి రావడంతో ఏపీ రాజకీయాల్లో దూమారం రేపింది. ఈ వ్యవహారం ఇంకా చల్లారకముందే… నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఏపీ ప్రభుత్వం తీరుపై హైకోర్టును ఆశ్రయించడం ప్రాధాన్యత సంతరించుకుంది.