కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పాకిస్తాన్ మీద ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాద కార్యకలాపాలని నియంత్రించేందుకు పార్టీ కి చేతకాకపోతే సహకరించడానికి భారత్ సిద్ధంగా ఉందని అన్నారు. ఫలితాలు తీవ్రంగా ఉంటాయని అన్నారు. గురువారం ఆయన ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాలని మాట్లాడారు.
ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే శక్తి పాకిస్తాన్ కి లేదని వారు భావిస్తే భారత్ సహాయం తీసుకోవచ్చు అని సూచించారు. భారత్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు ఉగ్రవాదులు ప్రయత్నిస్తే మేము పాకిస్థాన్లోకి ప్రవేశించి వాళ్ళ మీద దాడి చేస్తామని అన్నారు. భారత్ ఇప్పటిదాకా ఏ దేశం పైన దాడి చేయలేదని అన్నారు ఇతర దేశాల భూభాగాన్ని ఆక్రమించుకోవడానికి కూడా ప్రయత్నం చేయలేదని అన్నారు.