గత కొన్ని సంవత్సరాలుగా నడుస్తున్న చాలా కేసులలో మార్గదర్శి చిట్ ఫండ్ కేసు కూడా ఒకటి. మార్గదర్శి చిట్ ఫండ్ లో సరైన మార్గాన్ని అవలంభించలేదన్న కేసులో పలుమార్లు సీఐడీ రామోజీరావు మరియు అతని కోడలు శైలజా కిరణ్ లకు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇంకా ఈ మధ్యం కూడా రామోజీరావు అనారోగ్యంగా ఉన్నప్పటికీ సిఐడి అధికారులు డైరెక్ట్ గా ఇంటికి వెళ్లి విచారించి వచ్చారు. తాజాగా మరోసారి రామోజీరావు మరియు శైలజా కిరణ్ లకు సిఐడి నోటీసులను ఇచ్చింది. ఈ నోటీసులో ఆగష్టు 16వ తేదీన రామోజీరావు ను విచారణకు రమ్మని, మరియు ఆగష్టు 17వ తేదీన శైలజ కిరణ్ ను విచారణకు హాజరు కావాలని పేర్కొన్నారు.
రామోజీ రావు, శైలజా కిరణ్ కు సీఐడీ నోటీసులు…
-