లేటు వయసులో అదిరిపోయే అందాలు.. రమ్యకృష్ణ గ్లామర్ ట్రీట్

-

తెలుగు చిత్ర పరిశ్రమలో రమ్యకృష్ణ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు..హీరోయిన్ గా ఎన్నో సక్సెస్ చిత్రాలను ఇండస్ట్రీకి అందించింది..వయస్సు మీద పడుతున్న కూడా వన్నె తగ్గని అందంతో కుర్ర హీరోయిన్లకు పోటీని ఇస్తుంది.

పాజిటివ్ నెగిటివ్ క్యారెక్టర్స్ అని తేడా లేకుండా అన్ని రకాల పాత్రలలో నటించి తన అందం అభినయంతో ఆకట్టుకున్న రమ్యకృష్ణ ఇప్పటికీ మంచి మంచి పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది.

సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ ఒకపక్క మూవీలు చేస్తూనే, మరోపక్క డ్యాన్స్ ఐకాన్ షో కి జడ్జిగా వ్యవహరిస్తూ బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ షోలో ఓ కంటెస్టెంట్ నా అల్లుడు మూవీలో NTR తో రమ్యకృష్ణ చేసిన సాంగ్ కు డాన్స్ చేసింది.

ఈ సందర్భంగా రమ్యకృష్ణ మాట్లాడుతూ ‘ఎన్టీఆర్ తో ఈ సాంగ్ కి డ్యాన్స్ చేసేటప్పుడు నేను నాలుగు నెలల గర్భవతిని. అందుకే ఈ సాంగ్ నాకెప్పుడూ స్పెషల్ అంత త్వరగా మర్చిపోలేను’ అని తెలిపింది. ఇది ఇలా ఉండగా తాజాగా రమ్యకృష్ణ ఫోటోలు వైరల్‌ అయ్యాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version