రమ్యకృష్ణ రేంజ్ మాములుగా లేదుగా.. వామ్మో.. ఒక్క ఎపిసోడ్‌కు అన్ని లక్షలా?

-

నీలాంబరిగా ఆడియన్స్ మదిలో నిలిచిపోయిన సీనియర్​ నటి రమ్యకృష్ణ.. ఇప్పుడు యువతరం మదిలో శివగామిగా చెరగని ముద్ర వేశారు. ఆమె తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో వైవిధ్యమైన పాత్రలను పోషిస్తూ ఇప్పటికీ కెరీర్​లో దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం మంచి ప్రాధాన్యత పాత్రలు ఎంచుకుంటూ దూసుకుపోతున్న రమ్యకృష్ణ బుల్లితెరపై కూడా సందడి చేస్తున్నారు. అయితే ఇందుకోసం రమ్యకృష్ణ తీసుకునే పారితోషికం హాట్ టాపిక్‌గా మారింది.

ఆహా వేదికగా.. ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా ఇటీవల డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే డ్యాన్స్ ఐకాన్ పేరుతో రియాలిటీ డ్యాన్స్ షోను తీసుకొచ్చింది ఆహా. ఈ కార్యక్రమానికి యాంకర్‌గా ఓంకార్ వ్యవహరించగా మెంటార్‌గా శ్రీముఖి, మోనాల్ గజ్జర్ చేస్తున్నారు. అలాగే న్యాయ నిర్ణేతలుగా కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ తోపాటు రమ్యకృష్ణ వ్యవహరిస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రోమోలు ఇది వరకే విడుదల చేశారు. అవి కాస్త నెట్టింట వైరల్‌గా మారాయి. అయితే ఈ షోకి జడ్జిగా వ్యవహరించేందుకు రమ్యకృష్ణ భారీ పారితోషికాన్నే అందుకున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.

ఓంకార్ యాంకర్‌గా చేస్తున్న ఈ డ్యాన్స్‌ రియాలిటీ షో డ్యాన్స్ ఐకాన్ ప్రోగ్రామ్ కు న్యాయ నిర్ణేతగా వ్యవహరించేందుకు గానూ.. సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ.. ఒక్కో ఎపిసోడ్‌కు సుమారు రూ. 4.5 లక్షల వరకు రెమ్యునరేషన్ అందుకున్నట్లు సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. అయితే ఇది ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉంది. ఒకవేళ ఇదే నిజమైతే.. ఇలాంటి రియాలిటీ షోకి ఎవరు ఈ రేంజ్‌లో పారితోషికం అందుకోలేదని చర్చించుకుంటున్నారు. కాగా ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా అదరగొడుతున్న రమ్యకృష్ణ రోజుకు రూ. 10 లక్షల వరకు ఛార్జ్ చేస్తుందట. అంటే ఒక సినిమాకు పది రోజులు పని చేస్తే రూ. కోటి వరకు అందుకునే అవకాశం ఉందన్నమాట.

ఇక ఇటీవల విడుదలై డిజాస్టర్‌గా నిలిచిన లైగర్ సినిమాలో రౌడీ హీరో విజయ్ దేవరకొండకు తల్లిగా నటించింది రమ్యకృష్ణ. ఈ పాత్ర కోసం శివగామి రూ. 1.5 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుందని టాక్. దాదాపు ఓ స్టార్ హీరోయిన్ పారితోషికం అందుకున్నంతగా శివగామి రమ్యకృష్ణ రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో రమ్యకృష్ణ స్థాయి ఏంటో అర్థమవుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version