టాలీవుడ్ నటి కేరళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్. తన అందంతో, స్మైల్ తో ఎంతోమంది అభిమానుల హృదయాలను దోచుకుంది. తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అతి తక్కువ సమయంలో టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. తెలుగుతో పాటు మలయాళం, తమిళ భాషలలో కూడా నటించి అక్కడ కూడా మంచి అభిమానాన్ని సొంతం చేసుకుంది.
ఇటివల కార్తికేయ 2తో భారీ విజయాన్ని అందుకొని సంబరాల్లో మునిగి తేలుతుంది అనుపమ. త్వరలో టీజే టిల్లు సిక్వెల్, ’18 పేజెస్’, ‘బటర్‌ఫ్లై’ చిత్రాలతో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. తాజాగా అనుపమ ఎల్లో కలర్ శారీలో మెరిసింది. ఇటీవలే ఈ మలయాళీ కుట్టి కార్తికేయ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆగస్టు 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు చందూ మొండేటి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో అనుపమ.. నిఖిల్ జోడీగా నటించారు. మంచి కంటెంట్ అండ్ విజువల్స్‌తో ఈ సినిమా సూపర్ హిట్‌గా దిశగా దూసుకువెళ్తోంది.
ఈ అమ్మడు తన హెయిర్ స్టైల్‌తో చాలా ఫేమస్ అయ్యింది. ఉంగరాల జుట్టుకు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇటీవలే కార్తికేయ సినిమాలో కూడా అనుపమ కర్లీ హెయిర్‌తో కనిపించింది. తాజాగా అనుపమ శారీలో కొత్త హెయిర్ స్టైల్‌లో మెరిసింది. ఎల్లో కలర్ శారీ కట్టిన అనుపమ.. జుట్టును పైకి ముడివేసింది. లూజ్ హెయిర్ కాకుండా… జుట్టును జడల వేసి చుట్టేసి పైకి పెట్టింది. తాజాగా అనుపమ షేర్ చేసిన పిక్స్‌లో డిజైనర్ పసుపు చీర మరియు బ్యాక్‌లెస్ కట్ స్లీవ్ బ్లౌజ్‌లో అనుపమ అందంగా కనిపిస్తోంది.
ఈ ఫోటోలు చూసిన అభిమానులు అనుపమ చాలా అందంగా ఉందంటూ కితాబిస్తున్నారు. ఇక అనుపమ సినిమాల విషయానికి వస్తే.. బ్లాక్ బస్టర్ డీజే టిల్లు సీక్వెల్‌గా ఓ సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్‌గా అనుపమ నటించనుందని తెలుస్తోంది. నేహా శెట్టి ప్లేస్‌లో అనుపమను చిత్రబృదం దించుతున్నారని తాజా టాక్. అంతేకాదు ఇప్పటికే అనుపమ సినిమా కోసం బప్పందంపై సైన్ చేసినట్లు తెలుస్తోంది.
సిద్ధు జొన్నలగడ్డ హీరోగా చేస్తోన్న ఈ డీజే టిల్లు సీక్వెల్‌ను సితార ఎంటర్టైన్‌మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు కూడా హీరో సిద్ధునే స్క్రిప్ట్, డైలాగ్స్ రాశారట. త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. అనుపమ పరమేశ్వరన్‌కు తెలుగుతో పాటు తమిళ మలయాళ భాషల్లో కూడా మంచి పాపులారిటీ వుంది. ఈ భామ ‘ప్రేమమ్’ అనే సినిమాతో మలయాళ సినిమాలకు పరిచయమైంది. ఆ సినిమా అక్కడ సూపర్ హిట్ అవ్వడంతో అనుపమకు తెలుగులో త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ‘అ ఆ’లో అవకాశం వచ్చింది.